చలికాలంలో రోజూ ఒక దానిమ్మపండు తింటే ఏమవుతుంది? 

13 December 2024

Velpula Bharath Rao

దానిమ్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఎంత మందికి తెలుసు. దీన్ని రోజూ తినడం వల్ల ఐరన్ లోపం తగ్గుతుందిని వైద్య నిపుణులు చెబుతున్నారు.

 పొటాషియం, ఫోలేట్, మాంగనీస్,  విటమిన్లు సీ, ఇ వంటి అనేక ముఖ్యమైన పోషకాలు ఇందులో ఉన్నాయి. అయితే చలికాలంలో దీన్ని తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

ఈ సందర్భంగా పోషకాహార నిపుణుడు నమామి అగర్వాల్  కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలియజేశాడు.  రోజూ ఒక దానిమ్మపండు తింటే  ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తుందని తెలిపాడు. 

దానిమ్మపండులో పాలీఫెనాల్స్ ఉంటాయని, అవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఆయన చెప్పాడు. దానిమ్మలో విటమిన్ సీ ఇతర యాంటీ-ఆక్సిడెంట్లు కూడా ఉంటాయని వెల్లడించాడు.

దానిమ్మ రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతుంది. దానిమ్మపండులో మంచి మొత్తంలో ఫైబర్ కూడా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగ్గా ఉంచడంలో సహాయపడుతుంది. 

 జీర్ణ సమస్యలున్నప్పుడు దానిమ్మ రసంలో ఉప్పు కలిపి తాగితే మంచి ప్రయోజనాలు ఉంటాయి. దానిమ్మను రోజూ తీసుకోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. 

దానిమ్మ ముడతలు, మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది. రక్తహీనత ఉన్నవారు తప్పనిసరిగా దానిమ్మను తినాలని వైద్యులు సూచిస్తున్నారు.

దానిమ్మ ఏడాది పొడవునా పండుతుంది. దానిమ్మ గింజల్లో ఎన్నో రకాలు పోషకాలు ఉన్నాయి. దానిమ్మ అల్జీమర్స్ వ్యాధికి చెక్‌ పెట్టి జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి.