డయాబెటిస్ ఉన్నవారు డ్రాగన్ ఫ్రూట్ తినొచ్చా..?
23 September 2025
Ravi Kiran
రోగనిరోధక శక్తిని పెంచడంలో డ్రాగన్ ఫ్రూట్ కీలకపాత్ర పోషిస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. ఇందులోని విటమిన్ సి ఇన్ఫెక్షన్లు రాకుండా పోరాడుతుంది.
చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడమే కాదు.. గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో డ్రాగన్ ఫ్రూట్ సహాయపడుతుంది.
డ్రాగన్ ఫ్రూట్‌లోని ఫైబర్ కంటెంట్.. మెరుగైన జీర్ణక్రియకు ఉపయోగపడుతుంది. అలాగే మలబద్దకం, కడుపు సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది.
ఇందులో ఉండే మెగ్నీషియం రక్తపోటును కంట్రోల్‌లో ఉంచుతుంది. అలాగే బీపీతో బాధపడేవారికి ఈ డ్రాగన్ ఫ్రూట్ బాగా ఉపయోగపడుతుంది.
షుగర్ పేషెంట్స్ డ్రాగన్ ఫ్రూట్ ఎలాంటి భయం లేకుండా తినొచ్చు. ఇందులో ఫైబర్ కంటెంట్ డయాబెటిస్ రోగులకు ఎంతగానో మేలు చేస్తుంది.
చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో డ్రాగన్ ఫ్రూట్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులోని విటమిన్ సి చర్మం కాంతిని పెంపొందిస్తుంది.
డ్రాగన్ ఫ్రూట్‌లోని మెగ్నీషియం ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అందుకే ఇది కీలక నొప్పులతో బాధపడుతున్నవారికి ఎంతగానో ఉపయోగకరం
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
మరిన్ని వెబ్ స్టోరీస్
పితృ పక్షం రోజున ఇలా చేస్తే.. పితృ దోషం నుంచి ఉపశమనం..
ఎండు చేపలు పోషకాల భాండాగారం.. డైట్లో ఉంటే.. అనారోగ్యంపై దండయాత్రే..
విటమిన్ డి సహజంగా పెరగాలంటే ఏం చేయాలి?