రాత్రుళ్లు అన్నం బదులుగా చపాతీలు తింటున్నారా.? ఇది తెలిస్తే ఎగిరిగంతేస్తారు

05 September 2025

Ravi Kiran

మీరు తినే ఆహారం మీ నిద్రను ప్రభావితం చేస్తుంది. కొంతమంది రాత్రి భోజనానికి చపాతీలు తింటే.. ఇంకొందరు అన్నం తింటారు. మరి మీరు ఎక్కువగా నిద్రపోవాలంటే ఈ రెండింటిలో ఏది మంచిదో తెలుసుకుందామా

రాత్రి భోజనం తినడం వల్ల కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. అన్నం త్వరగా జీర్ణమవుతుంది. అందుకే చాలా మంది రాత్రిపూట అన్నం తినడానికి ఇష్టపడతారు.

బియ్యం అధిక గ్లైసెమిక్ ఆహారం, ఇది మెదడులో ట్రిప్టోఫాన్ విడుదల చేయడం ద్వారా మీకు త్వరగా నిద్రపడుతుంది. మరి చపాతీలు తినడం వల్ల ఏం జరుగుతుంది.?

ఇక చపాతీలలో ఫైబర్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శక్తిని నెమ్మదిగా విడుదల చేస్తాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. 

బరువు తగ్గాలనుకునేవారు, మధుమేహం ఉన్నవారు చపాతీలు తినడం మంచిది. ఈ చపాతీలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. అందువల్ల, రాత్రిపూట చపాతీలు తినడం వల్ల కడుపు నిండిన అనుభూతి  అనిపించవచ్చు.

మీరు తినే ఆహారం మీ నిద్రపై ప్రభావం చూపుతుందని గుర్తుంచుకోండి. రాత్రి భోజనం తినడం మంచిది. ఎందుకంటే ఇది సులభంగా జీర్ణమవుతుంది. శరీరంపై అంత భారం పడదు.మీకు త్వరగా నిద్రపోవడానికి సహాయపడుతుంది.

చపాతీ తినడం వల్ల మీ కడుపు ఉబ్బరంగా, బరువుగా అనిపిస్తుంది. అందువల్ల, రాత్రి  చపాతీ కంటే రైస్ తీసుకోవడం మంచిదని నిపుణులు అంటున్నారు. మీరూ డైట్ చేయాలంటే ముందుగా డాక్టర్‌ను సంప్రదించండి.