రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలి.. ఎక్కువ తాగడం కూడా ప్రమాదమేనా?

11 october 2025

Samatha

నీరు ఆరోగ్యానికి చాలా మంచిది. ఒక వ్యక్తి తప్పకుండా ప్రతి రోజూ కనీసం లీటర్ నుంచి రెండు లీటర్ల నీళ్లు తాగాలని చెబుతుంటారు. అందుకే చాలా మంది ఎక్కువ నీరు తాగుతుంటారు.

అయితే చాలా మందిలో ఒక డౌట్ ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఇదే నీటి సూత్రం పాటించాలా? లేదా? అని కాగా, ఇప్పుడు మనం దాని గురించే వివరంగా తెలుసుకుందాం.

కొన్ని సార్లు అధికంగా నీరు తాగడం వలన కూడా సమస్యలు వస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. నీరు తాగడం ఆరోగ్యానికి మంచిదే, కానీ ఎవరు ఎంత మోతాదులో తాగాలనేది వారి ఆరోరోగ్య పరిస్థితులను బట్టి ఉంటుందంట.

నీరు తాగడం అనేది వ్యక్తి శారీరక శ్రమ, ఆరోగ్య పరిస్థితులతో పాటు, ఉష్ణోగ్రత, వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. కొన్ని సార్లు నీరు ఎక్కువ తీసుకున్న ప్రమాదమే అని తెలిపారు.

ముఖ్యంగా డీ హైడ్రేషన్ సమస్యతో బాధపడే వారు తప్పకుండా ఎక్కువ మోతాదులో నీరు తీసుకోవాలంట. దీని వలన తలనొప్పి, అలసట వంటి సమస్యలు తగ్గిపోతాయి.

ఎక్కువగా నీరు తాగడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. కిడ్నీ సమస్యల, తల నొప్పి, మూత్ర పిండాల సమస్యలు రాకుండా చేస్తుంది. శరీరానికి సహజ నిగారింపునిస్తుంది.

అయితే నీరు తాగడం మంచిదే అయినప్పటికీ అతిగా తాగడం వలన ఎక్కువ సార్లు మూత్ర విసర్జన అవ్వడం, అదనపు నీటిని మూత్ర పిండాలు తెలిగించలేవు కాబట్టి ఇది కిడ్నీ సమస్యలకు కారణం అవుతుంది.

అందువలన ఎవరైతే కిడ్నీ సమస్యలతో బాధపడుతుంటారో, వారు అధిక మొత్తంలో కాకుండా గంటకు 350 మి. లీటర్ల నీరు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదంట.