అన్నం బదులు చపాతీ తింటున్నారా..? నేరుగా షెడ్డుకే..

29 November 2024

TV9 Telugu

TV9 Telugu

చాలా మంది ఆహారంలో గోధుమ చపాతీ తింటుంటారు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు అన్నంకి బదులు ప్రతి విషయంలోనూ ప్రత్యామ్నాయాల్ని వెతుక్కుంటుంటారు

TV9 Telugu

ఇలాంటి వారు రాత్రి భోజనం మానేసి చపాతీని తింటుటారు. ఇలా తినడం వల్ల బరువు తగ్గడంతో పాటు మరెన్నో ఆరోగ్య ప్రయోజనాల్ని సొంతం చేసుకోవచ్చని భావిస్తారు

TV9 Telugu

నిజానికి, చపాతీని పోషకాల సమ్మేళనంగా పేర్కొంటున్నారు నిపుణులు. ఇందులో ‘బి’, ‘ఇ’ విటమిన్లతో పాటు కాపర్‌, జింక్‌, అయొడిన్‌, మాంగనీస్‌, సిలికాన్‌, పొటాషియం, క్యాల్షియం.. వంటి ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి

TV9 Telugu

ఇవన్నీ రోజువారీ శరీరానికి కావాల్సిన పోషకాలను కొద్ది మొత్తాల్లో భర్తీ చేస్తాయి. చపాతీలో ఉండే సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు శరీరానికి శక్తిని అందిస్తాయి. తద్వారా రోజంతా ఉత్సాహంగా ఉండచ్చు

TV9 Telugu

అయితే కొంతమంది మాత్రం చాపాతీ అస్సలు తినకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గోధుమలలో గ్లోబులిన్, గ్లియాడిన్ ఉంటాయి. కొందరికి వీటితో అలర్జీ వస్తుంది. ఇలాంటి వారు చపాతీ తినకూడదు

TV9 Telugu

అలాగే జీర్ణ సమస్యలున్నవారు గోధుమ పిండి చపాతీలు అస్సలు తినకూడదు. గోధుమలు ఈ వ్యాధిని మరింత తీవ్రతరం చేస్తాయి. మధుమేహ రోగులు కూడా చపాతీ తినకూడదు

TV9 Telugu

గోధుమల్లో అధికంగా GI ఉంటుంది. ఇది రక్తంలో చక్కెరను పెంచుతుంది. అజీర్ణం లేదా కాలేయ వ్యాధి ఉన్నవారు గోధుమలను ఇతర తృణధాన్యాలతో కలిపి తినాలి. గోధుమలు మాత్రమే తినడం వల్ల జీర్ణక్రియ సమస్యలు తీవ్రమవుతాయి

TV9 Telugu

గోధుమ చపాతీ మాత్రమే తింటే శరీరంలో అలర్జీలు పెరిగే అవకాశం ఉంది. అలాగే షుగర్ లెవెల్స్ కూడా పెరగవచ్చు. సాధారణంగా చపాతీలో  గ్లైసెమిక్ ఇండెక్స్ 51 నుండి 69 వరకు ఉంటుంది. అందుకే వీటికి దూరంగా ఉండాలి