కోడి కాళ్ల పులుసు ఇలా పెట్టారంటే సూపర్ అనాల్సిందే

Prasanna Yadla

14 November 2026

Pic credit - Pinterest

కొబ్బరి పేస్ట్ తో చేసే వేడి వేడి కోడి కాళ్ల పులుసును అన్నంలో తింటే ఆ రుచే వేరు. దీనిని ఎలా చేయాలంటే? 

కోడి కాళ్ల పులుసు

ముందుగా కోడి కాళ్లను తీసుకుని మంచిగా కడిగి  కొద్దిగా పసుపు, ఉప్పు కూడా వేసి పక్కన పెట్టుకోవాలి.

 కొద్దిగా పసుపు, ఉప్పు

ఇప్పుడు ఒక గిన్నెలో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, రెండు పచ్చిమిర్చి, అర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి.

ఉల్లిపాయ ముక్కలు

ఇంకా దీనిలో నాలుగు కరివేపాకు, రెండు టమాటా ముక్కలు కూడా దీనిలో వేసి మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి.

 టమాటా ముక్కలు 

ఇక ఇప్పుడు దీనిలో కొద్దిగా కారం, అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, గరం మసాలా వేసి కలపాలి.

 ధనియాల పొడి

ఇప్పుడు శుభ్రం చేసిన కోడి కాళ్లను దీనిలో వేసి మసాలాలు మంచిగా పట్టేలా బాగా కలపాలి.

 మసాలాలు 

దీనిలో కొద్దిగా నీళ్లు పోసి దీనికి మూత పెట్టి మీడియం మంటపై దీనిని బాగా ఉడికించాలి.

మీడియం మంటపై

పులుసుకు మంచి టేస్ట్ రావడానికి దీనిలో కొబ్బరి పేస్ట్ కూడా వేసుకోవాలి. కోడి కాళ్లు మెత్తగా ఉడికే వరకు నీళ్లు పోస్తూ మరిగించాలి.

నీళ్లు పోస్తూ మరిగించాలి.