మెరిసే చర్మానికి ముల్తానీ..ఏ పదార్థాలతో కలిపి పెట్టుకోవడం మంచిదో తెలుసా?

Samatha

28 January 2026

ముఖం అందంగా, నిగారింపుగా ఉండాలని ఎవరు కోరుకోరు చెప్పండి. చాలా మంది. తమ ఫేస్ చాలా సౌందర్యంగా ఉండాలి అనుకుంటారు.

ముఖ సౌందర్యం

దీని కోసం తరచూ చాలా డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు. కానీ ఇవేవి లేకుండా ముల్తానీ మట్టితో మీ ముఖాన్ని అందంగా తీర్చిదిద్దుకోవచ్చును అది ఎలానో చూద్దాం.

ప్రొడక్ట్స్ కొనుగోలు

మీ ఇంటిలో దొరికే కొన్ని పదార్థాలతో ముల్తానీ మట్టిని కలిపి పెట్టుకోవడం వలన ముఖం నిగారింపుగా, సౌందర్యంగా కనిపిస్తుందంట. దీని గురించి తెలుసుకుందాం.

ఇంటిలో పదార్థాలు

మీ ముఖం చాలా డల్‌గా కనిపిస్తే మీరు మీ ముఖానికి ముల్తానీ మట్టిలో తేనె కలిపి పెట్టుకోవచ్చు దీని వలన ముఖం హైడ్రేట్ అవుతుంది.

ముల్తానీ , తేనె

ఫేస్ పై నల్లటి మచ్చలు, టానింగ్ ఎక్కువగా ఉంటే, ముల్తానీ మట్టిలో టమాటో రసం వేసి, ఫేస్ ప్యాక్ తయారు చేసి అప్లై చేసుకోవాలి. మీ అందం రెట్టింపు అవుతుంది.

ముల్తానీ , టమాటో రసం

ముఖం చాలా జిడ్డుగా కనిపిస్తే ముల్తానీ మట్టిలో శనగ పిండి, పెరుగుకలిపి ముఖానికి అప్లై చేయడం వలన ముఖం చాలా నిగారింపుగా ఉంటుందంట

ముల్తానీ , శనగపిండి

అలాగే ముల్తానీ మట్టిలో పసుపు కలిపి ముఖానీకి అప్లై చేయడం వలన ఫేస్ చాలా అందంగా రెడీ అవ్వడమే కాకుండా, ఫేస్‌కు సహజ మెరుపు వస్తుందంట.

ముల్తానీ , పసుపు

ఇలా కనీసం వారానికి రెండు లేదా మూడు సార్లు అప్లై చేయడం మంచి ఫలితం కనిపిస్తుందంట. ఇది మీ ముఖాన్ని అందంగా, నిగారింపుగా తయారు చేస్తుంది.

ముఖం నిగారింపు