దిమ్మతిరిగే రెమ్యునరేషన్స్ 'టాక్సిక్' స్టార్స్.. ఒక్కొక్కరికి మరీ అన్ని  కోట్లా!

10-07-2026

Pic credit - Instagram

Phani Ch

గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం లో కన్నడ రాకింగ్ స్టార్ యశ్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా మూవీ 'టాక్సిక్'

ఈ భారీ ప్రాజెక్ట్ క్రేజ్‌కు తగ్గట్టుగానే ఇందులో నటిస్తున్న స్టార్ కాస్ట్ రెమ్యునరేషన్లు కూడా ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

'కేజీఎఫ్' సిరీస్‌తో గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన హీరో యశ్ ఈ చిత్రం కోసం ఏకంగా రూ. 50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు టాక్.

ఈ సినిమాలో అత్యంత కీలకమైన 'గంగ' అనే పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్న లేడీ సూపర్ స్టార్ నయనతార పారితోషికం ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

నయనతార ఈ చిత్రం కోసం మొదట రూ.18 కోట్లు డిమాండ్ చేయగా, మేకర్స్‌తో జరిగిన చర్చల అనంతరం రూ. 12 కోట్లకు అంగీకరించినట్లు తెలుస్తోంది.

మరోవైపు ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కూడా తన కెరీర్‌లోనే అత్యధిక పారితోషికం  రూ.15 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంది.

యంగ్ అండ్ టాలెంటెడ్ నటీమణులు రుక్మిణి వసంత్ మరియు తారా సుతారియా ఈ చిత్రం కోసం చెరో రూ. 3 కోట్లు అందుకోగా, మరో కీలక పాత్ర పోషిస్తున్న హుమా ఖురేషికి రూ. 2 కోట్లు చెల్లించినట్లు టాక్ వినిపిస్తోంది