రీ ఎంట్రీలో జెనీలియా జోరు.. ఇక పై వరుస సినిమాలతో బిజీ బిజీ.? 

Rajeev 

16 Jul 2025

Credit: Instagram

ఒకప్పుడు తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ఇప్పుడు టాలీవుడ్ కు దూరం అయిన హీరోయిన్స్ లో జెనీలియా ఒకర

ఇప్పటికీ చాలా మంది అభిమాన హీరోయిన్ జెనీలియానే.. అప్పటికే ఈ ముద్దుగుమ్మ తన నటనతో పాటు అందంతో ఆకట్టుకుంది.

చిన్న వయసులోనే నటిగా సినీరంగంలోకి అడుగుపెట్టింది. తుజే మేరీ కసమ్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది

ఈ చిత్రంలో రితేష్ దేశ్ ముఖ్ హీరోగా నటించారు. తొలి చిత్రంలోనే ఏర్పడిన వీరిద్దరి పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారింది.

బాయ్స్ సినిమాతో సౌత్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన జెనీలియా.. ఆ తర్వాత వరుస సినిమాలతో అలరించింది. శంకర్ దర్శకత్వంలో వచ్చింది ఈ సినిమా.

తెలుగులో బొమ్మరిల్లు సినిమాతో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా బొమ్మరిల్లు చిత్రంలో ఆమె నటనకు ఫిల్మ్‌ఫేర్ అవార్డు లభించింది.

ఇక ఇప్పుడు మరోసారి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది ఈ చిన్నది. కిరీటి హీరోగా నటిస్తున్న జూనియర్ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుంది జెనీలియా