పెళ్లి వద్దు కానీ.. అది మాత్రం.. కావాలంటున్న శృతి హాసన్

Phani CH

12 Jul 2025

Credit: Instagram

శృతిహాసన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచేయాల్సిన పని లేదు .. అనగనగా ఒక ధీరుడు చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ ముద్దుగుమ్మ.

కమల్ హాసన్ కూతురుగా ప్రేక్షకులకు పరిచయమైన ఆ తరువాత తన నటనతో.. ప్రెకషకుల దగ్గర మంచి పేరు తెచ్చుకుంది ఈ నటి.

కాగా శృతిహాసన్ కెరియర్ మొదట్లో తెలుగులో అన్ని ఫ్లాప్స్ వచ్చాయి. దాంతో ఆమెని అప్పట్లో ఐరన్ లెగ్ అని కూడా అనేవాళ్ళు.

కానీ పవన్ కళ్యాణ్ తో శృతిహాసన్ చేసిన గబ్బర్ సింగ్ సినిమా ఆమె కెరియర్ ని మార్చేసింది. గబ్బర్ సింగ్ చిత్రం తెలుగులో బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాకుండా శృతిహాసన్ కి ఎన్నో ఆఫర్లు తీసుకొచ్చింది.

అప్పటినుంచి శృతిహాసన్ గోల్డెన్ లెగ్ గా మారిపోయింది. ఆ తరువాత వచ్చిన శృతిహాసన్ సినిమాలు అన్నీ కూడా దాదాపు.. మంచి విజయం సాధించినవే.

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో శృతిహాసన్ తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతూ  పెళ్లి అంటేనే నాకు భయం వేస్తుంది అని తెలిపింది.

ఇద్దరు వ్యక్తులు కలవడానికి పెళ్లి లేదా పేపర్ ద్వారా అగ్రిమెంట్ చేసుకునే విధానం నాకు భయాన్ని కలిగిస్తోంది. కానీ కమిట్మెంట్, లాయల్టీ పై నాకు నమ్మకం ఉంది.

గతంలో ఒకసారి పెళ్లి వరకు వెళ్లాను. కానీ వర్కౌట్ కాలేదు. పెళ్లి చేసుకోవాలని లేకపోయినా తల్లిని కావాలనే కోరిక మాత్రం ఉందట..