అనిరుద్‌ ఎదుగుదలలో హీరో ధనుష్‌ పాత్ర ఎంత.?

30 December 2024

Battula Prudvi

మన దేశంలో ఇప్పుడు టాప్‌ మ్యూజిక్‌ డైరక్టర్ల గురించి ప్రస్తావించాల్సి వస్తే, తప్పకుండా యంగ్‌ సెన్సేషన్‌ అనిరుద్‌ పేరు లేకుండా మాట్లాడుకోలేం.

సౌత్‌ ఇండస్ట్రీ నుంచి నార్త్ ఇండస్ట్రీ వరకు అంతగా పాపులర్‌ అయ్యారు కొలవెరి ఢీ సాంగ్ ఫేమ్‌ అనిరుద్‌.

మరి ఆయన సినిమాల్లోకి రావడానికి కారణం ఎవరు? ఆ డీటైల్స్ అన్నీ చెప్పేశారు రజినీ కూతురు ఐశ్వర్య రజనీకాంత్‌.

గతంలో ఓ ఇంటర్వ్యూలో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్‌ గురించి మాట్లాడారు కోలీవుడ్ దర్శకురాలు ఐశ్వర్య.

సంగీత దర్శకుడు అనిరుద్‌ తల్లిదండ్రులు అతన్ని పై చదువుల కోసం ఫారిన్‌ పంపాలని అనుకున్నారని ఆమె చెప్పారు.

మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్‌ రవిచందర్ మ్యూజిక్‌ టాలెంట్‌ కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌కి చాలా బాగా నచ్చిందట.

ఎప్పుడూ అనిరుద్‌ - ధనుష్‌... ఏవో ట్యూన్స్ గురించి మాట్లాడుకుంటూ ఉండేవారని తెలిపారు ఐశ్వర్య రజినీకాంత్.

అలా త్రీ సినిమా మ్యూజిక్‌ డైరక్టర్‌గా అనిరుద్‌ని ఫిక్స్ చేశారట ఐశ్వర్య - ధనుష్‌. ''మేం ఛాన్స్ ఇచ్చాం.. ఆ తర్వాత అతను టాలెంట్‌తో ఎదిగాడు'' అని చెప్పారు.