ఆ అందానికే అసూయపుడుతుందేమో.. రెడ్ శారీలో ఊర్వశీ గ్లామర్ షో
samatha
24 February 2025
Credit: Instagram
అందాల ముద్దుగుమ్మ ఊర్వశీ రౌటెలా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం.
ఈ బ్యూటీ తన డ్యాన్స్, గ్లామర్‌తో ఎంతో మందిని ఆకట్టుకుంటది. ఇక ఈ చిన్నదానికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఊర్వశీ బాలకృష్ణ డాకు మహారాజ్ మూవీలో దబిదిబిడే అంటూ ఐటమ్ సాంగ్‌తో అందరినీ ఆకట్టుకుంటుంది.ఈ మూవీ సక్సెస్‌తో ఈ ముద్దుగుమ్మ క్రేజ్ మరింత పెరిగింది.
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ ఈ మధ్య వరస ఫొటోషూట్‌తో కుర్రకారు మనసు దోచేస్తుంటుంది.
తాజాగా ఈ ముద్దుగుమ్మ రెడ్ కలర్ శారీలో తన అందంతో విందు భోజనం పెట్టేసింది. చీరలో కుందనపు బొమ్మలా మెరిసిపోయింది ఈ అమ్మడు.
కొంటె చూపు చూస్తూ.. చూడటానికి చాలా అందంగా కనిపించి, తన గ్లామర్‌తో యూత్‌ను తన వైపుకు తిప్పుకుంటుంది బాలయ్య బ్యూటీ.
ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఊర్వశీ బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు తమ అభిమానులు.
ఇక ఊర్వశీ రౌటెలా ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన పాకిస్తాన్, ఇండియా క్రికేట్ మ్యాచ్‌కు వెళ్లి ఏంజాయ్ చేసిన విషయం తెలిసిందే ఈ ఫొటోస్ కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి.