2024 పెళ్లి చేసుకున్న టాలీవుడ్ సినీ ప్రముఖులు వీరే 

Phani CH

24 December 2024

అక్కినేని నాగచైతన్య-శోభితలు కొన్నాళ్లు ప్రేమించుకున్న తర్వాత ఇటీవలే అన్నపూర్ణ స్టూడియోలో వీరి పెళ్లి గ్రాండ్‌గా జరిగింది.

టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌ రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నా కొన్ని సంవత్సరాలుగా రిలేషన్‌లో ఉండి పెళ్లి పెళ్లి చేసుకున్నారు.

సిద్ధార్థ్ - అదితి రావు హైదరి తెలంగాణలోని వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని 400 ఏళ్ల పురాతన రంగనాథస్వామి ఆలయంలో వీరి ప్రేమ వివాహం ఘ‌నంగా జరిగింది.

టాలీవుడ్‌ యంగ్‌ హీరో కిరణ్ అబ్బవరం తనతో కలిసి 'రాజావారు రాణిగారు' సినిమాలో నటించిన హీరోయిన్ రహస్య గోరఖ్‌ని లవ్‌ చేసి వివాహం చేసుకున్నాడు.

ఈ సంవత్సరంలోనే హీరోయిన్‌ తాప్సీ మథియాస్ బోయ్ పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగు పెట్టింది.  మథియాస్ బోయ్ డెన్మార్క్ మాజీ బ్యాడ్మింటన్ ప్లేయర్.

వరలక్ష్మీ శరత్ కుమార్ తన చిరకాల ప్రియుడు ముంబైకి చెందిన ఆర్ట్ గ్యాల‌రీ నిర్వాహ‌కుడైన నికోలాయ్ సచ్‌దేవ్‌ని పెద్దలని ఒప్పించి పెళ్లి చేసుకుంది.

దాదాపు 47 ఏళ్ల వయసులో తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుబ్బరాజు స్రవంతి అనే అమ్మాయితో పెళ్లి జరిగింది. వీరి ఫోటోస్ నెట్టింట వైరల్ అయ్యాయి.

ఇటీవలే హీరోయిన్‌ కీర్తి సురేష్ తన చిన్న నాటి ఫ్రెండ్‌, బిజినెస్‌మెన్‌ ఆంటోనీ తట్టిల్‌ని పెళ్లి చేసుకుంది. వీరిద్దరి మధ్య 15 ఏళ్ల నుండి ప్రేమాయణం కొనసాగింది.

'లై' మూవీతో తెలుగు తెరకు పరిచయమైన మేఘా రాజకీయ కుటుంబానికి చెందిన సాయి విష్ణుతో రిలేషన్ లో ఉండి తాజాగా వివాహం చేసుకున్నారు.