ఒకప్పుడు పాన్ ఇండియా హీరోయిన్ శ్రియ . తెలుగు, తమిళంలో అగ్ర హీరోలతో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి స్టార్ డమ్ సంపాదించుకుంది.
బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పటికీ సినీరంగంలో డిమాండ్ ఉన్న హీరోయిన్.
తెలుగులో ఒకప్పుడు టాప్ హీరోయిన్. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, ఎన్టీఆర్, ప్రభాస్ వంటి స్టార్ హీరోలతో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది.
ఇప్పటికీ కుర్ర హీరోయిన్లకు పోటీగా ఏమాత్రం తరగని అందంతో మెస్మరైజ్ చేస్తోంది శ్రియా. ప్రస్తుతం శ్రియా వయసు 42 సంవత్సరాలు.
ఈ క్రమంలోనే తన ఫిట్నెస్, డైట్ ప్లాన్ రివీల్ చేసింది ఈ ముద్దుగుమ్మ.ప్రతిరోజు కఠినమైన వ్యాయమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తానని తెలిపింది శ్రియా.
అలాగే తన దినచర్యలో యోగా కచ్చితంగా ఉండాల్సిందే అని.. మానసిక ప్రశాంతత కోసం నిత్యం యోగాసనాలు చేస్తానని తెలిపింది.
వ్యాయామం చేసే ముందు తినడం వల్ల తనకు తగినంత శక్తి వస్తుందని.. తేలికైనా ఆహారం తీసుకోవడానికి ఇష్టపడతానని తెలిపింది