మజాకా పైన బోలెడన్ని ఆశలు పెట్టుకున్న రీతూ వర్మ 

Rajeev 

24 February 2025

Credit: Instagram

రీతూ వర్మ.. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన ఈ భామ ఇప్పుడు హీరోయిన్‌గా మారిన సినిమాలు చేస్తోంది.

తెలుగుతో పాటు తమిళ్ లోనూ వరుసగా సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటుంది ఈ అమ్మడు.

కెరీర్ బిగినింగ్ లో పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది ఈ భామ. ఆతర్వాత సినిమాల్లోకి వచ్చింది.

ఎన్టీఆర్ హీరోగా నటించిన బాద్షా సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా హీరోయిన్ చెల్లి పాత్రలో మెరిసింది.

2013లో ప్రేమ ఇష్క్ కాదల్ అనే సినిమాలో హీరోయిన్ గా చేసింది. నా రాకుమారుడు, ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాల్లో హీరోయిన్ గా చేసి ఆకట్టుకుంది.

ఇక 2016లో వచ్చిన పెళ్ళిచూపులు సినిమా ఈ బ్యూటీకి మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ఆకట్టుకుంది. 

నిన్నిలా నిన్నిలా, టక్‌ జగదీష్‌, ఒకే ఒక జీవితం, కణం, ఆకాశం, మార్క్ ఆంటోని సినిమాలు చేసింది. ఇప్పుడు మజాకా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.