అమ్మబాబోయ్.. రీతూ వర్మ ఆస్తులు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే 

17 october 2025

Rajeev Rayala

Images: Instagram

తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని హీరోయిన్ రీతూ వర్మ. ఈ బ్యూటీకి మంచి క్రేజ్ , ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

అచ్చతెలుగుమ్మాయి అయినప్పటికీ టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. అనుకోకుండా అనే షార్ట్ ఫిల్మ్ ద్వారా కెరీర్ స్టార్ట్ చేసింది.

ఆ తర్వాత 2012లో 48 గంటల ఫిల్మ్ ప్రాజెక్ట్ కాంపిటీషన్లో ఉత్తమ షార్ట్ ఫిల్మ్ గా ఎంపికైంది. ఇందులో ఉత్తమ నటిగా పురస్కారం అందుకుంది. 

నెమ్మదిగా తెలుగులో హీరోయిన్ ఆఫర్స్ అందుకుంది రీతూ వర్మ.కెరీర్ తొలినాళ్లల్లో ఆమె నటించిన సినిమాలు మిశ్రమ స్పందన అందుకున్నాయి

2016లో పెళ్లి చూపులు సినిమాతో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.ఇటీవలే మజాకా సినిమాతో సూపర్ హిట్ అందుకుంది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం రీతూ వర్మ ఆస్తులు, లైఫ్ స్టైల్ గురించి ఆసక్తికర విషయాలు నెట్టింట వినిపిస్తున్నాయి.

ఆమె ఆస్తులు రూ.12 కోట్లు అని సమాచారం. ఈ అమ్మడు ఒకొక్క సినిమాకు రూ. 48లక్షల నుంచి రూ.3కోట్ల వరకు అందుకుంటుంది.