బాలకృష్ణకు ఆ ముగ్గురు హీరోయిన్స్ అంటే చాలా ఇష్టమా? ఎవరు వారంటే?
samatha
08 February 2025
Credit: Instagram
డాకు మహారాజ్‌తో సక్సెస్ అందుకున్న బాలయ్య ప్రస్తుతం అఖండ 2లో నటిస్తున్నారు. సక్సెస్ జోష్‌లో ఉన్న ఈ హీరోకు పద్మభూషన్ అవార్డుకు ఎంపికైన విషయం తెలిసిందే.
దశాబ్దాలుగా తెలుగు సినిమా రంగంలో అందిస్తున్న సేవలకు బాలయ్యకి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది.
దీంతో నందమూరి అభిమానులు, కుటుంబ సభ్యుల ఆనందం అంతా ఇంతా కాదు. బాలయ్యకు అవార్డు ప్రకటించడంతో నారా భువనేశ్వరి తన తమ్ముడికి పార్టీ ఇచ్చింది.
అయితే ఈ క్రమంలో ఆమె బాలయ్యను కొన్ని ప్రశ్నలు అడిగారు. అందులో నీకు నీ సినీ కెరీర్‌లో ఇష్టమైన ముగ్గురు నటీమనులు ఎవరు అని ప్రశ్నించారు.
దీనికి బాలయ్య చిన్న చిరునవ్వు నవ్వి, ఆయన తనతో నటించిన ముగ్గురు క్రేజీ హీరోయిన్స్ పేర్లను తెలిపారు. వారు ఎవరంటే?
లారీ డ్రైవర్, ముద్దుల మావయ్య, రౌడీ ఇన్స్పెక్టర్, మువ్వా గోపాలుడు లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో బాలయ్యకు జోడిగా నటించిన విజయశాంతి బాలయ్యకు ఇష్టమైన హీరోయిన్
అలాగే, సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు చిత్రాల్లో సిమ్రాన్ కూడా తనకు చాలా ఇష్టమైన హీరోయిన్ అని బాలయ్య తెలిపారు.
అంతే కాకుండా బంగారు బుల్లోడు, దేవుడు, వంశానికొక్కడు లాంటి చిత్రాల్లో బాలకృష్ణకు జోడిగా నటించిన ముద్దుగుమ్మ రమ్య కృష్ణ కూడా బాలయ్యకు ఇష్టమైన హీరోయిన్ అంట.