ఈ వెబ్ సిరీసులు క్రేజీ మాత్రమే కాదు.. చాలా కాస్ట్లీ గురూ..
Prudvi Battula
Images: Pinterest
03 November 2025
మనీషా కొయిరాలా, అదితి రావు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ రూ. 200 కోట్ల నుంచి రూ. 250 కోట్ల బడ్జెట్‌తో నిర్మించబడింది. ఇది నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.
హీరామండి
అజయ్ దేవగన్ నటించిన ఈ క్రేజీ వెబ్ సిరీస్ మొత్తం బడ్జెట్ రూ. 200 కోట్లు. ఈ సిరీస్ డిస్నీ+ హాట్‌స్టార్ OTT ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉంది. ఇందులో మొత్తం 6 ఎపిసోడ్‌లు ఉన్నాయి.
రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్నెస్
నవాజుద్దీన్ సిద్ధిఖీ, సైఫ్ అలీ ఖాన్ నటించిన ఈ సిరీస్ సీజన్ 1 కేవలం రూ. 40 కోట్లతో నిర్మించగా, రెండవ సీజన్ రూ. 100 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించబడింది. ఇది నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.
సేక్రెడ్ గేమ్స్
శోభిత ధూళిపాళ ప్రధాన పాత్రలో నటించిన ఈ వెబ్ సిరీస్ మొదటి సీజన్ రూ. 100 కోట్ల బడ్జెట్‌తో రూపొందించబడింది. 2019లో అమెజాన్ ప్రైమ్‌లో విడుదల అయింది. రెండవ సీజన్ బడ్జెట్ రూ. 60 కోట్ల మాత్రమే.
మేడ్ ఇన్ హెవెన్
అమెజాన్ ప్రైమ్‌లో ఈ క్రేజి వెబ్ సిరీస్ 3 సీజన్‌లకు మంచి ఆదరణ లభించింది. 2వ సీజన్ రూ. 60 కోట్ల బడ్జెట్‌తో నిర్మించగా, 2024లో విడుదలైన 3వ సీజన్ రూ. 80 కోట్ల బడ్జెట్‌తో నిర్మించబడింది.
మీర్జాపూర్
ఇది అత్యధికంగా వీక్షించబడిన వెబ్ సిరీస్. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ OTT ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉంది. దాని 2 సీజన్‌ల నిర్మాణానికి ఒక్కొక్కటి రూ.60 కోట్లు ఖర్చు చేసినట్లు చెబుతున్నారు.
ది ఫ్యామిలీ మ్యాన్
ఇది అమెజాన్ ప్రైమ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన వెబ్ సిరీస్. మొదటి సీజన్‌కు మంచి స్పందన రావడంతో 2వ సీజన్‌ను రూ. 40 కోట్ల బడ్జెట్‌తో, 3వ సీజన్‌ను రూ. 45 కోట్ల బడ్జెట్‌తో రూపొందించారు.
ఇన్‌సైడ్ ఎడ్జ్
రూ. 300 కోట్ల బడ్జెట్‌తో బాహుబలి: బిఫోర్ ది బిగినింగ్ అనే వెబ్ సిరీస్‌ను నిర్మించాలని ప్లాన్ చేశారు. మృణాల్ ఠాకూర్ సహా మరి కొంతమంది నటించడానికి సంతకం చేశారు. కానీ మొదట్లోనే ఆగిపోయింది.