సినీ ప్రియులకు పండగే.. ఫిబ్రవరిలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే!
samatha
08 February 2025
Credit: Instagram
సినీ ప్రియులకు అదిరిపోయే న్యూస్. ఫిబ్రవరి అంటేనే ప్రేమికులకు ఎంతో ఇష్టమైనది. ఎందుకంటే, ఈ నెలలో వాలెంటైన్స్ డే వస్తుంది.
ఇక వాలెంటెన్స్ వీక్ స్టార్ట్ కాగా, లవర్స్ షాపింగ్, మూవీస్ చూస్తూ చాలా సరదాగా సంతోషంగా గడుపుతారు. కాగా, వారి గుడ్ న్యూస్ అనే చెప్పాలి.
వారికి సూపర్ న్యూస్ ఇది. ఈ ఫిబ్రవరిలో పలు సినిమాలు రిలీజ్ కానున్నాయి. కాగా, ఆ సినిమాలు ఏవో మనం ఇప్పుడు చూద్దాం.
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్, త్రిష, రెజీనా కాసాండ్రా నటించిన విడామయార్చి మూవీ ఫిబ్రవరి 6న విడుదల కానుంది.
స్టార్ హీరో ధనుష్ రాయన్ సినిమా తర్వాత మరోసారి తన కథతో, తన దర్శకత్వంలోనే తెరకెక్కిన సినిమా జాబిలమ్మ నీకు అంత కోపమా.
ధనుష్ జాబిలమ్మ నీకు అంతకోపమా మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా, ఈ సినిమా ఫిబ్రవరి 21న థియేటర్లలో రిలీజ్ కానున్నది.
అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన తండేల్ మూవీ ఫిబ్రవరి 7న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీ విడుదల కోసం అక్కినేని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన సినిమా బజూక. ఈ సినిమా ఫిబ్రవరి 14న , వాలెంటైన్స్ డే రోజున థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానున్నది.