అగ్గిపుల్ల.. సబ్బుబిల్ల.. కుక్కపిల్ల కాదేదీ కవితకు అనర్హం అన్నారు కదా పెద్దలు. ఇప్పుడు మన లిరిక్ రైటర్స్ ఈ మాటనే బాగా గట్టిగా పట్టుకున్నట్లున్నారు.
అందుకే సరదాగా అన్న మాటలతోనే పాటలు అల్లేస్తున్నారు. ట్రెండ్ అయిన పదాలనే తీసుకొచ్చి.. హుక్ లైన్స్‌గా పెట్టి ఖతర్నాక్ మాస్ సాంగ్స్ రాస్తున్నారు.
ఆ కుర్చీని మడతబెట్టి.. ఈ మాట ఓ తాత నోట్లోంచి వచ్చింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో తిరిగింది.. అది తమన్‌కు బాగా నచ్చి గుంటూరు కారంలో ట్యూన్ అయింది.
అదేమో ఇప్పటికే 550 మిలియన్స్‌కు పైగా వ్యూస్ తెచ్చుకుంది. దీనంతటికీ ఆ కుర్చీ మడతబెట్టి అనే హుక్ లైనే కారణం.
ఏం చేద్దామంటవ్ మరి అనే మాట అప్పట్లో కేసీఆర్ ఓ ప్రెస్ మీట్‌లో అంటే అది వైరల్ అయింది. దాన్నే హుక్ లైన్‌గా తీసుకుని డబుల్ ఇస్మార్ట్‌లో మార్ ముంత ట్యూన్ ఇచ్చారు మణిశర్మ.
తాజాగా లైలాలో ట్రెండింగ్ సాంగ్ కోయ్ కోయ్‌ను వాడేసారు విశ్వక్ సేన్. ఇదే బ్యాక్‌డ్రాప్‌లో పెంచల్ దాస్‌తో పాట పాడించేసారు.. అది కాస్తా వైరల్ అవుతుందిప్పుడు.
నితిన్ హీరోగా వస్తున్న రాబిన్ హుడ్‌లో అదిదా సర్‌ప్రైజ్ అనే పాట ఉంది. ఇందులో కేతిక శర్మ చిందేస్తున్నారు. వారసుడు ఆడియో ఫంక్షన్‌లో దిల్ రాజు చెప్పిన అదిదా సారు ఫుల్ ట్రెండ్ అయింది.
అల వైకుంఠపురములో బన్నీ చెప్పిన మేడమ్ సార్ మేడమ్ అంతే మాటతో.. ఆ మధ్యే మారుతినగర్ సుబ్రమణ్యం సినిమాలో పాట కట్టేసారు. మొత్తానికి మాటలే పాటలుగా మారిపోతున్నాయిప్పుడు.