బాహుబలి టూ సంక్రాంతికి వస్తున్నాం.. పదేళ్లలో 300 కోట్ల తెలుగు సినిమాలు

Prudvi Battula 

04 February 2025

బాహుబలి సినిమా 2015లోనే 586 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.. 2017లో మరోసారి బాహుబలి 2తో 300 కోట్లు కాదు.. ఏకంగా 1800 కోట్లు వసూలు చేసి చూపించాడు రాజమౌళి.

2019లో సాహో సినిమాతో మరోసారి 300 కోట్ల మార్క్ అందుకున్నాడు ప్రభాస్. సుజీత్ తెరకెక్కించిన ఈ మూవీతో 400 కోట్లకు పైగానే వసూలు చేసాడు.

ప్రభాస్ కాకుండా తొలిసారి తెలుగు ఇండస్ట్రీలో 300 కోట్ల సినిమా ఇచ్చిన హీరో అల్లు అర్జున్. 2021లో విడుదలైన పుష్ప సినిమాతో ఈయన 350 కోట్లకు పైగా వసూలు చేసాడు.

2022లో రాజమౌళి మరోసారి తన మ్యాజిక్ చూపించాడు. ట్రిపుల్ ఆర్ సినిమాతో 1200 కోట్లకు పైగా భారీ వసూలు చేసాడు.

ఇక 2023లో ఆదిపురుష్, సలార్ సినిమాలతో 300 కోట్లు ఈజీగా దాటేసాడు ప్రభాస్. అందులో సలార్ అయితే 600 కోట్లు వసూలు చేసింది.

ఇక 2024లో తెలుగు సినిమా నాలుగు సార్లు 300 కోట్లు దాటింది. గత ఏడాది సంక్రాంతికి చిన్న సినిమాగా వచ్చిన 300 కోట్లకు పైగా కొల్లగొట్టింది హనుమాన్.

కల్కి 1100 కోట్లకుపైగా వాసులుతో రెండోసారి 1000 కోట్ల క్లబ్బులో చేరిన ప్రభాస్.. మొత్తంగా ఆరోసారి 300 కోట్ల సినిమా ఇచ్చాడు.

ఇక దేవరతో 400 కోట్లకు పైగా వసూలు చేసాడు ఎన్టీఆర్. ట్రిపుల్ ఆర్ తర్వాత ఈయన సినిమా 300 కోట్లు దాటడం ఇది రెండోసారి.. సోలోగా అయితే మొదటి సారి.

పుష్ప 2తో 1800 కోట్లకు పైగా వసూలు చేసి బాక్సాఫీస్ కింగ్ అనిపించుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.

ఇక 2025లో సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో 12వ 300 కోట్ల సినిమా ఇచ్చాడు వెంకటేష్. రీజినల్ సినిమాల్లో ఈ రికార్డు మాత్రం మొదటిసారి.