సంక్రాంతికి వస్తున్నాం.. సహా వెంకటేష్ ఇండస్ట్రీ హిట్స్ ఎన్నో తెలుసా..?
Prudvi Battula
04 February 2025
సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఎవరూ ఊహించిన స్థాయిలో ఏకంగా 300 కోట్ల క్లబ్బులోకి అడుగు పెట్టాడు వెంకీ.
ఇది ఈ సంక్రాంతికి ఇండస్ట్రీ హిట్ అయినా ఈ సినిమా విడుదలైనపుడు దర్శక నిర్మాతలు కూడా ఊహించి ఉండరు 300 కోట్లు వసూలు చేస్తుందని..!
అల వైకుంఠపురములో పేరు మీదున్న రికార్డులను తన పేర రాసుకున్నాడు వెంకటేష్. 65 ఏళ్ళ వయసులోనూ అదే దూకుడు చూపిస్తున్నాడు.
2000లో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ కలిసుందాం రా సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు వెంకీ మామ. ఇందులో సిమ్రాన్ హీరోయిన్.
ఉదయ్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా అప్పట్లో 20 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి ఆల్ టైమ్ క్లాసిక్‌గా నిలిచింది.
ఆ తర్వాత మళ్లీ పాతికేళ్ళకు ఇప్పుడు మరోసారి ఫ్యామిలీ సినిమాతోనే సంక్రాంతికి వస్తున్నాం అంటూ 300 కోట్లు వసూలతో సరికొత్త చరిత్రకు తెరతీసారు వెంకటేష్.
1992లోనే చంటి సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు వెంకీ. అప్పట్లో ఈ సినిమా ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.
ఇది కూడా ఫ్యామిలీ సినిమానే. మొత్తంగా మూడుసార్లు కుటుంబ కథా చిత్రాలతోనే ఇండస్ట్రీ రికార్డులు కదిలించిన ఘనత కేవలం వెంకటేష్‌కే సొంతం.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఈ ఫిల్మ్ స్టూడియోస్ ప్రపంచంలోనే అతి పెద్దవి..
బాలయ్య పక్కన లీడ్ రోల్.. అవకాశాలు మాత్రం నిల్.. ఎవరా భామలు.?
ప్రపంచంలోనే భారీ వసూళ్లతో సత్తా చాటిన టాప్ 10 సినిమాలు..