త్రిష బాలీవుడ్‌కు వెళ్లిపోవడానికి కారణం అదే.. 

07 March 2025

Prudvi Battula 

దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో సుదీర్ఘ సినిమా ప్రస్థానం కలిగిన హీరోయిన్లలో అందాల తార త్రిష పేరు ముందు వరుసలో ఉంటుంది.

సుమారు రెండు దశాబ్దాలుగా హీరోయిన్ గా కెరీర్ కొనసాగిస్తుందామె. తెలుగుతో పాటు తమిళ్‌లోనూ స్టార్ హీరోయిన్‎గా వెలుగొందుతోంది.

ఇదిలా ఉంటే సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా వెలుగొందిన త్రిష బాలీవుడ్ పై పెద్దగా ఆసక్తి చూపలేదు.

2010లో కట్టామీటా అనే సినిమాతో హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది త్రిష. అక్షయ్ కుమార్ ఇందులో హీరోగా నటించారు.

అయితే ఈ సినిమా పెద్దగా ఆడలేదు. దీంతో మళ్లీ బాలీవుడ్ వైపు చూడలేదు త్రిష. అయితే అక్కడ త్రిషకు అవకాశాలు రాలేదని ప్రచారం సాగింది.

అయితే నిజానికి తన కుటుంబాన్ని ముంబాయికి మార్చడం ఇష్టం లేకనే బాలీవుడ్ సినిమాలను వదిలేసుకుందట త్రిష.

బాలీవుడ్ కు వెళ్లాలంటే దక్షిణాదిలో అన్నిటినీ వదిలేసుకోవాలి. మళ్లీ బాలీవుడ్ లో కొత్తగా మొదలెట్టాలి. అప్పట్లో అంత ఆసక్తి నాకు లేదు' అంది త్రిష.

ప్రస్తుతం చిరంజీవితో కలిసి విశ్వంభర, అజిత్‎తో గుడ్ బ్యాడ్ అగ్లీ, కమల్‎తో కలిసి థగ్‌ లైఫ్‌ చిత్రాల్లో నటిస్తోంది త్రిష.