సాయి పల్లవి ఈవెంట్లలో చీరకట్టులో కనిపించడానికి కారణం ఇదే..

05 March 2025

Prudvi Battula 

దక్షిణాది చిత్రపరిశ్రమలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ సాయి పల్లవి. యూత్‏లో ఈ ముద్దుగుమ్మకు ఉండే క్రేజ్ గురించి తెలిసిందే.

ఫిదా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సాయి పల్లవి.. ఆ తర్వాత కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.

గ్లామర్ షోలకు దూరంగా ఉంటూ పాత్ర ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటుంది. మరోవైపు ఎంబీబీఎస్ పూర్తి చేసింది ఈ కేరళ కుట్టి.

సాయి పల్లవి నటించే కథా పాత్రలు కూడా సంప్రదాయ రీతిలోనే ఉంటాయన్న సంగతి తెలిసిందే. ప్రేమమ్ మూవీతో మనసులు దోచుకుంది ఈ బ్యూటీ.

సినిమా ఈవెంట్లలో ఎక్కువగా చీరకట్టులో లేదా చుడిదార్ ధరించి పాల్గొంటుంది. అందుకు గల కారణాలను కూడా చెప్పుకొచ్చింది సాయి పల్లవి.

వేడుకల్లో చీరలే సౌకర్యంగా ఉంటాయని తెలిపింది. పబ్లిక్ ఫంక్షన్లలో పాల్గొన్నప్పుడు తెలియని ఒత్తిడి ఉంటుందని.. అప్పుడు మనసుపై లగ్నమై ఉండాలని..

అలాంటి సమయాల్లో దుస్తులపై దృష్టి పెట్టడం కుదరదని అన్నారు. అలాంటప్పుడు చీర ధరించడమే సౌకర్యంగా ఉంటుందని తాను భావిస్తానని అన్నారు.

ఎలాంటి ఒత్తిడి లేకుండా వేడుకలలో ప్రశాంతంగా తాను చీర ధరించి పాల్గొనడానికి ఇష్టపడతానని తెలిపింది. ఇప్పుడు తండేల్ చిత్రంలో నటిస్తుంది.