ఆ సినిమా రష్మిక చాల స్పెషల్ అంట..
05 March 2025
Prudvi Battula
ఛలో, గీత గోవిందం సినిమాలతో టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా.
ఇక పుష్ప సినిమాతో పాన్ ఇండియా ఫేమస్ అయిపోయింది. గత ఏడాది ఈ సినిమాకు సీక్వెల్ పుష్ప 2 తో మరో బ్లాక్ బస్టర్ అందుకుంది.
ఈ ఏడాది బాలీవుడ్ హిస్టారికల్ మూవీ చావాతో తొలి విజయాన్ని అందుకుంది. తాజాగా ఈ సినిమా తెలుగులో కూడా విడుదల అయింది.
ఇదిలా ఉంటే టాలీవుడ్‌లో విజయ్ దేవరకొండ సరసన సరసన గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో నటించింది రష్మిక మందన్నా.
ఇందులో గీత గోవిందం మూవీ వంద కోట్లు సాధిస్తే.. డియర్ కామ్రేడ్ సినిమా మాత్రం ఫ్యాన్స్ ను తీవ్రంగా నిరాశపర్చింది.
కాగా ఈ సినిమా రిలీజై ఐదేళ్లు గడిచాయి. ఈ నేపథ్యంలో ఫలితం ఎలా ఉన్నప్పటికీ ఆ జ్ఞాపకాలు మరిచిపోలేనివని తెలిపింది రష్మిక.
నేను ఇప్పటికే ఎన్ని సినిమాలు చేసినా.. ఇప్పటికీ చాలా మంది నన్ను లిల్లీ అని పిలుస్తున్నారని ఆనందం వ్యక్తం చేసింది.
ఈ సినిమా నా కెరీర్‌లో చాలా ప్రత్యేకమైందని,ఈ మూవీని ఆదరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపింది రష్మిక.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఈ సుకుమారి తళుకుకి వెన్నెల చిన్నబోదా.. డేజ్లింగ్ రుక్సార్..
తెలుగు కుర్రాళ్ల క్రష్ లిస్టులో యాడ్ అయినా కాయాదు.. ఎవరి బ్యూటీ.?
డార్లింగ్ ఎక్కువగా ఎందుకు మాట్లాడరు.?