ఆ పని చేయలేక సినిమాల్లోకి వచ్చా.. తేజ సజ్జా సీక్రెట్ రివీల్

Phani CH

16 June 2025

Credit: Instagram

తేజ సజ్జా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు.. స్టార్ హీరోల సినిమాలన్నింటిలో నటించి బాల నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

అయితే చిన్న వయస్సులో  హీరోల పక్కన నటించినా ఒక వయసు వచ్చేసరికి చదువు మీద ఫోకస్ పెట్టి కనీసం గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడం చూస్తూనే ఉన్నాం.

మరి కొంత మంది మాత్రం ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క చదువును నిర్లక్ష్యం చేయకుండా డిగ్రీ పట్టా పొందిన వారిని చూస్తూనే ఉన్నాం.

కానీ తేజ మాత్రం బిటెక్ చదవలేక ఇండస్ట్రీ లకి వచ్చినట్లు చెప్పుకొచ్చాడు. మొదట తేజ నాన్నకు తాను సినిమాల్లో తీసుకురావడం ఇష్టం లేదట.

చిన్నప్పుడు తేజ సినిమా షూటింగ్ కి వెళ్లి అక్కడ విషయాలు తెలియ జేస్తూ ఆనందంగా ఉండటం చూసి తను సినిమాల్లో చేయడానికి ఒప్పుకున్నారట.

బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న సమయంలో ఒక రోజు తేజ వాళ్ళ నాన్న దగ్గరకు వెళ్లి ఈ ఇంజనీరింగ్ చదవడం తన వల్ల కావడంలేదు అని చెప్పాడట.

నేను సినిమాల్లో హీరోగా నటిస్తాను అని చెప్పడంతో.. ఆయన వెంటనే ఓకే అన్నారు” అని తేజ చెప్పుకొచ్చాడు. అలా తాను హీరోగా మారినట్లు తెలిపాడు.