దర్శకధీరుడు రాజమౌళి ఫస్ట్ శాలరీ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

Phani CH

16 June 2025

Credit: Instagram

దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు..  మొదట్లో సీరియల్స్ కు డైరెక్టర్ పని చేసి స్టూడెంట్ నెంబర్ సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు

తన మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్న రాజమౌళి  కెరియర్ పరంగా ఇండస్ట్రీలో వెనక్కి తిరిగి చూసుకోలేదు.

ఇప్పటివరకు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్నాయి.

ఇటీవల బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్‌గా   గుర్తింపు పొందిన రాజమౌళి RRR సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో దర్శకుడిగా గుర్తింపు పొందారు.

ఇది ఇలా ఉంటే  తాజాగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, రష్మిక హీరో హీరోయిన్లుగా నటించిన కుబేర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు రాజమౌళి.

అయితే సుమ రాజమౌళి వద్దకు వెళ్లి ఆయన తీసుకున్న మొదటి రెమ్యూనరేషన్ గురించి అడగగా అసిస్టెంట్ ఎడిటర్ గా పని చేసే సమయంలో తనకు 50 రూపాయలు జీతం ఇచ్చారని సమాధానం చెప్పారు.

ఇక ప్రస్తుతం మహేష్ బాబు తో రాజమౌళి  పాన్ వరల్డ్ స్థాయిలో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే.  ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.