పాన్ ఇండియా హీరో కామెంట్స్‌కు గాల్లో తేలిపోతున్న స్రవంతి
Phani CH
16 June 2025
Credit: Instagram
సాధారణంగా ఏ సినిమా ఫంక్షన్ చూసినా చాలా వరకూ సుమ కనకాలే హోస్ట్ చేస్తూ సందడి చేస్తుంటారు.. అయితే ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తున్న యాంకర్ పేరు స్రవంతి చొక్కారపు.
ఈ ముద్దుగుమ్మ మాటలు వింటున్న కుర్రకారు యాంకరింగ్ అంటే ఇలా ఉండాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా ఆమె వేసుకొస్తున్న డ్రెస్‌ల గురించి కూడా చెవులు కోరుకుంటున్నారు కుర్రకారు.
అది సినిమా ఫంక్షన్ అయినా.. సీరియల్ ఫంక్షన్ అయినా.. ఇతర ఏ ప్రమోషనల్ ఈవెంట్ అయినా హాట్ షోతో రచ్చ చేస్తుంది.
దాదాపు 14 ఏళ్ల తర్వాత జూన్ 14వ తేదీన హైదరాబాద్ లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో గద్దర్ అవార్డ్స్ వేడుక ఘనంగా జరిగిన విషయం తెలిసిందే.
ఉత్తమ నటుడిగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అల్లు అర్జున్ అవార్డు అందుకోగా తనకొచ్చిన అవార్డు ఆర్మీకే అంకితం అంటూ ఎక్స్ ద్వారా షేర్ చేసిన విషయం తెలిసిందే.
ఇదంతా ఇలా ఉండగా ఈ ఈవెంట్ లో అల్లు అర్జున్ కి యాంకర్ స్రవంతి ని చీరలో బాగున్నావ్.. అందంగా కనిపిస్తున్నావు అంటూ పొగిడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మనం ఎంతగానో ఇష్టపడే హీరో,మనం కట్టుకున్న చీర చాలా బాగుంది,చాలా అందంగా ఉన్నారు అంటే ఇక భూమి మీద ఆగగలమా అంటూ ఆ క్యూట్ వీడియోను స్రవంతి సోషల్ మీడియా లో షేర్ చేసింది.