ట్రెండీ డిజైన్ టెంప్ట్ చేస్తున్న తమన్నా లుక్స్

Phani CH

10 December 2024

హీరోయిన్ తమన్నా ఈ ఏడాది ఇప్పటికే బాక్ 2తో భారీ హిట్ కొట్టేసింది. హార్రర్ జోనర్‌లో తెరకెక్కిన ఈ చిత్రం రూ.100 కోట్లకి పైగా వసూళ్లు సాధించింది.

ఇక తమన్నా చేతిలో ప్రస్తుతం వేద, ఓదెల 2 చిత్రాలు ఉన్నాయి. ఇక పర్సనల్ లైఫ్‌ విషయానికొస్తే విజయ్ వర్మతో తన లవ్ లైఫ్‌ను కూడా బాగానే ఎంజాయ్ చేస్తుంది మిల్కీ బ్యూటీ.

 శ్రీ  సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ హ్యాపీ డేస్ సినిమాతో కెరీర్‌లో టర్న్ తీసుకుంది.

ఆ తర్వాత వరుసపెట్టి స్టార్ హీరోల సినిమాల్లో నటించి పలు బ్లాక్ బస్టర్ హిట్స్ ఖాతాలో వేసుకుంది. 100% లవ్, ఆగడు, ఊపిరి, రచ్చ, బాహుబలి, F2, F3 లాంటి సూపర్ సక్సెస్ సినిమాల్లో తమన్నా నటించింది.

తెలుగులో దాదాపు అందరు స్టార్ హీరోల సరసన ఆడిపాడిన తమన్నా.. తన అందాలతో తమిళ, హిందీ ప్రేక్షకులను కూడా ఆకర్షించింది.

ప్రస్తుతం ముంబైలోనే సెటిల్ అయిన తమన్నా బాలీవుడ్ లో తమన్నా భాటియా బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో బిజీగా ఉంది. 

సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ తన అందచందాలతో అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. తాజాగా తమన్నా షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.