శోభిత ధూళిపాళకు ఇష్టమైన తెలుగు హీరో అతనే.. నాగచైతన్య మాత్రం కాదు మావ..
Phani CH
14 Jul 2025
Credit: Instagram
తెలుగు పిల్ల తెనాలి పిల్ల శోభిత ధూళిపాళ. బాలీవుడ్ లో సెటిల్ అయ్యింది. తెలుగులో కూడా సినిమాలు చేసింది. సోషల్ మీడియాలో మాత్రం కాకరేపుతోంది. కుర్రాళ్ళ చేత చెమటలు పుట్టిస్తోంది.
ఈ తెలుగు అందం మొదట హిందీ సినిమాల్లో తన అదృష్టాన్ని పరిక్షించుకుంది. 2016లో అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో వచ్చిన 'రామన్ రాఘవ్ 2.0'లో నటించింది.
ఆ తర్వాత 'చెఫ్', 'కాలాకాండి' మొదలగు హిందీ సినిమాలు చేసింది. తెలుగులో అడవి శేష్ హీరోగా వచ్చిన 'గూఢచారి' లో నటించి ఇక్కడి వారికి పరిచయమైంది.
తెలుగులో రెండు మూడు సినిమాల్లో మెరిసింది శోభిత.తమిళంలో ఆమె చేసిన పొన్నియన్ సెల్వన్ సినిమాలో..ఆమె అందానికి ఫిదా అయ్యారు ఆడియన్స్.
శోభిత ధూళిపాళ.. నాగ చైతన్య, సమంత విడాకుల తర్వాత అతనిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ ముద్దుగుమ్మ చైతన్యతో మ్యారేజ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంది.
అయితే శోభిత సబంధించిన ఓ వార్త బయటకు వచ్చింది. శోభిత చిన్నతనం నుంచి ఓ టాలీవుడ్ స్టార్ హీరోకు వీరాభిమాని అని తెలుస్తోంది.
ఆయన ఎవరో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. చిన్నతనం నుంచి శోభితకు పవన్ కళ్యాణ్ సినిమాలంటే చాలా ఇష్టమట. ఆయన సినిమాలు ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాల్సిందేనట.