ఈ తెలుగమ్మాయి అందానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే... శివాని  నాగారం క్యూట్ పిక్స్

Rajeev 

16 Jul 2025

Credit: Instagram

ఇండస్ట్రీలో కొత్త అందాలు ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కొత్త కొత్త హీరోయిన్ ప్రేక్షకులను అలరిస్తున్నారు. వారిలో శివాని ఒకరు.

ఈ అమ్మడు చేసింది ఒకే ఒక్క సినిమా. శివాని నాగరం నటనా జీవితాన్ని ఆడిషన్‌ల ద్వారా ప్రారంభించింది.

ఈ అమ్మడి మొదటి సినిమా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు (2024), ఈ చిత్రంలో సుహాస్ సరసన హీరోయిన్‌గా నటించింది.

ఈ సినిమాలో ఆమె లక్ష్మి అనే పాత్రలో కనిపించింది. ఈ సినిమాలో తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

ఇక ఈ చిన్నది సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను కవ్విస్తుంది ఈ భామ.

చేసింది ఒకే ఒక్క సినిమా కానీ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు వరుస ఆఫర్స్ ను అందుకుంటుంది ఈ బ్యూటీ.

సోషల్ మీడియాలో పద్దతిగా ఫోటోలు షేర్ చేస్తూ మెప్పిస్తునే.. మోడ్రన్ డ్రస్సుల్లోనూ అదరగొడుతోంది ఈ వయ్యారి భామ.