అందం, అభినయం ఉన్న అవకాశాలు లేక ఎదురుచూస్తున్న భామల్లో ప్రగ్యా జైస్వాల్ ఒకరు. ఈ చిన్నదాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
డేగ అనే సినిమాతో ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. తమిళం, తెలుగుతో పాటు హిందీలో కూడా తెరంగేట్రం చేసింది ఈ బ్యూటీ.
మిర్చి లాంటి కుర్రాడు సినిమాతో తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టింది. తరువాత కంచె సినిమాలో నటించింది. కంచె సినిమాలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఈ ముద్దుగుమ్మ అఖండ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. హీరోయిన్ గానే కాదు సెకండ్ హీరోయిన్ గానూ ఈ అమ్మడు ఆకట్టుకుంది.
తన అందం అభినయంతో మంచి మార్కులు కొట్టేసిన ఈ చిన్నది ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం అందుకోలేకపోయింది.
తాజాగా డాకు మహారాజ్ సినిమాతో మరో హిట్ అందుకుంది. ఈ సినిమాతో ఫుల్ జోష్ లో ఉంది ప్రగ్య. డాకు మహారాజ్ సక్సెస్ కావడంతో ఈ అమ్మడుకి వరుస అవకాశాలు వస్తాయని భావిస్తుంది.
సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ చిన్నది.