రాజాసాబ్‌లో ప్రభాస్ తాతగా సంజయ్ దత్.?
17 January
202
5
Prudvi Battula
రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి తెరకెక్కిస్తున్న రొమాంటిక్ హారర్ కామెడీ ఎంటర్టైనర్ సినిమా రాజా సాబ్.
ఇందులో డార్లింగ్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రిద్ధి కుమార్ ఓ పాత్రలో కనిపించనుంది.
జిషు సేన్‌గుప్తా, యోగి బాబు, వరలక్ష్మి శరత్‌కుమార్, సప్తగిరి, సీనియర్ స్టార్ కమెడియన్ బ్రహ్మానందం ముఖ్య పాత్రధారులు.
ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో T. G. విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్నారు.
ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ప్రభాస్ రాజా సాబ్ సినిమాపై ఆసక్తికరమైన విషయం బయటికి వచ్చింది.
ఇందులో సంజయ్ దత్ పాత్ర ఆత్మగా కనిపిస్తుందని తెలుస్తుంది. ఇందులో ప్రభాస్‌కు తాతగా నటిస్తున్నారు సంజయ్ దత్.
తాతయ్యే ఆత్మగా వచ్చాక ప్రభాస్ జీవితం ఎలా మారుతుందనే కథతో రాజా సాబ్ ప్రేక్షకుల ముందుకు వస్తుందని తెలుస్తుంది.
ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషల్లో ఈ ఏడాది ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఈ వయ్యారి చూపుకై ఆ జాబిల్లి కూడా ఎదురు చూస్తుంది.. కృతి పిక్స్ వైరల్..
ఆ చంద్రుడే ఈ అందాన్ని చెక్కి భువికి చేర్చాడు.. గార్జియస్ రుక్సార్..
దివి నుంచి జాలువారిన తారలు ఈ సుకుమారిని హత్తుకున్నాయి.. క్యూటీ అమృత..