డిజాస్టర్ బ్యూటీ తో దుల్కర్ సల్మాన్.. రిస్క్ వద్దంటున్న ఫ్యాన్స్
Phani CH
12 Jul 2025
Credit: Instagram
దుల్కర్ సల్మాన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు.. తెలుగులో నటుడుగా ఎంట్రీ ఇవ్వక ముందు నుంచే ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు.
దుల్కర్ 2012లో మలయాళ చిత్రం సెకండ్ షోతో సినీ రంగ ప్రవేశం చేశాడు, ఇందులో అతను గ్యాంగ్‌స్టర్ పాత్ర పోషించాడు.
2018 విడుదలైన మహానటి సినీరంతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టాడు దుల్కర్ సల్మాన్. సీతారామం, లక్కీ భాస్కర్ చిత్రాలతో మంచి విజయం తో పాటు భారీ ప్రజాదరణ పొందాడు.
దుల్కర్ వరుసగా సక్సెస్ సినిమాలు చేస్తున్న సంగతి ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది. తెలుగు దర్శకులు ఒకరిని మించి ఒకరు దుల్కర్ కు సక్సెస్ అందించారు.
దుల్కర్ తర్వాత చేయబోయే సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఐరన్ లెగ్ అంటూ పూజ మీద ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు.
వరుసగా సక్సెస్ కొడుతున్న తరుణంలో పూజ హెగ్డే తో కలిసి నటిస్తే సక్సెస్ కి బ్రేక్ పడుతుందని చాలామంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
గతంలో కూడా చాలామంది హీరోయిన్ల విషయంలో ఇది ఎదురైనా ధైర్యం తో ముందడుగు వేసి మంచి సక్సెస్ కూడా అందుకున్నాడు.