మాలీవుడ్ ఇండస్ట్రీ 2025 మార్చి నెల రిపోర్ట్ కార్డ్ మలయాళం ట్రేడ్ పండిట్స్ అందరిని ఆలోచనల్లో పడేసింది.
5 సినిమాలు రిలీజ్ అయితే జస్ట్ ఒక్క సినిమా మాత్రమే సక్సెస్ కావడం ఆందోళన కలిగిస్తోందనే టాక్ స్టార్ట్ అయింది.
కేరళ నిర్మాతల మండలి మార్చి బాక్సాఫీస్ రిపోర్ట్ ని రిలీజ్ చేసింది. మార్చిలో 15 సినిమాలు రిలీజ్ కాగా వాటిలో జస్ట్ ఎల్2 ఎంపురాన్ మాత్రమే హిట్‌గా నిలిచింది.
ఎంపురాన్ మినహా.. మిగిలిన సినిమాల బడ్జెట్‌లన్నీ కలిపితే 194కోట్లని డిక్లేర్ చేసింది ప్రొడ్యూసర్స్ కౌన్సిల్.
జస్ట్ 25 కోట్లు షేర్ వచ్చిందని వివరించింది. ఎంపురాన్ లేకుంటే పరిస్థితి ఏంటన్న చర్చ షురూ అయింది ఇండస్ట్రీలో.