18 June 2025

రెండు బడా సినిమా ఒక్కటి హిట్ అయినా.. అమ్మడి రేంజ్ మారిపోవడం ఖాయం 

Rajeev 

Pic credit - Instagram

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నిధి అగర్వాల్.. ప్రస్తుతం సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తుంది.

ఇప్పటివరకు ఈ అమ్మడు నటించిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ అయిన సంగతి తెలిసిందే.

దీంతో ఈ బ్యూటీకి తెలుగులో అంతగా ఆఫర్స్ రాలేదు. కానీ తమిళంలో మాత్రం వరుస అవకాశాలు అందుకుంది.

ఇప్పుడు తెలుగులో ఈ అమ్మడు నటిస్తోన్న లేటేస్ట్ మూవీ హరి హర వీరమల్లు. త్వరలోనే ఈ మూవీ అడియన్స్ ముందుకు రానుంది.

అలాగే ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాజా సాబ్ సినిమాలోనూ నటిస్తుంది. ఇటీవలే రాజా సాబ్ సినిమా టీజర్ విడుదలైంది. 

ఇప్పటివరకు వరుస డిజాస్టర్స్ అందుకున్న నిధి.. ఇప్పుడు భారీ హిట్టు కోసం వెయిట్ చేస్తుంది. పవన్ కళ్యాణ్, ప్రభాస్ సినిమాలతో పక్క హిట్స్ అందుకోనుంది. 

హరిహరవీరమల్లు, రాజా సాబ్ సినిమాలు హిట్ అయితే నిధి అగర్వాల్ స్టార్ డమ్ పెరిగిపోతుందని నెటిజన్స్ అంటున్నారు.