పవర్ స్టార్ తో సినిమాలను రిజెక్ట్ చేసిన నమ్రత.. కారణం..
Phani CH
14 Jul 2025
Credit: Instagram
మహేష్ భార్య నమ్రతా శిరోద్కర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు.. మోడలింగ్‌తో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ నటి మిస్ ఇండియా టైటిల్ గెలుచుకుంది.
ఆ తరువాత బాలీవుడ్ ద్వారా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఆ తరువాత టాలీవుడ్ అడుగు పెట్టింది నమ్రతా.
ఆ తర్వాత మహేష్ బాబును ప్రేమించి పెళ్లి చేసుకుంది నమ్రతా. పెళ్లి తరువాత సినిమాలకు పూర్తిగా గుడ్ బై తన కుటుంబాన్ని చూసుకోవడంలో బిజీ అయిపోయింది.
ఇది ఇలా ఉంటే గతం లో నమ్రత వన్ కళ్యాణ్ తో రెండు చిత్రాల్లో నటించాల్సింది.. అయితే నమ్రత వాటిని రిజెక్ట్ చేశారు.
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బద్రి చిత్రం లో హీరోయిన్ పాత్ర కోసం కోసం నమ్రతని అప్రోచ్ అయ్యారట. నమ్రతకి కథ చాలా బాగా నచ్చింది.
ఈ చిత్రంలో నటించేందుకు ఆసక్తి కూడా చూపారట. కానీ అదే టైంలో బాలీవుడ్ లో రెండు చిత్రాలలో నటిస్తుండడం వల్ల డేట్లు అడ్జస్ట్ చేయడం కుదరలేదట.
ఆ తర్వాత మరోసారి బాలు సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం నమ్రతని సంప్రదించగా ఆ టైంలో నమ్రత, మహేష్ బాబుతో రిలేషన్ లో ఉండడం వల్ల బాలు చిత్రాన్ని రిజెక్ట్ చేశారట.