టాలీవుడ్ క్రేజీ బ్యూటీ మృణాల్ ఠాకూర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ అమ్మడు అందమే కాదు, నటనకు కూడా ప్రతి ఒక్కరూ ఫిదా అవ్వాల్సిందే.
మృణాల్ ఠాకూర్
ఒక్క సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్లలో ఈ ముద్దుగుమ్మ ముందుంటుంది. చిత్ర పరిశ్రమలోకి అడుగు పెడుతూనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.
ఒక్క సినిమాతో క్రేజ్
ఈ చిన్నది సీతారామం మూవీతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఈ మూవీలో సీత పాత్రలో నటించి, తన నటనతో అందరి మనసు దోచుకుంది.
సీతారామం మూవీ
అమాయకంగా కనిపిస్తూ, చీర కట్టులో అందరినీ మంత్రముగ్థులను చేసింది. ఓవర్ నైట్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంది.
చీర కట్టులో అందం
ఇక ఈ మూవీ తర్వాత ఈ బ్యూటీ చాలా సినిమాల్లో నటించి మెప్పించింది. కానీ అవి అంతగా హిట్ అందుకోలేదు అయినప్పటికీ ఈ అమ్మడు క్రేజ్ తగ్గడం లేదు.
వరస సినిమాలు
వరసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ దూసుకెళ్తుంది. పెద్ద పెద్ద ప్రాజెక్ట్‌లలో ఛాన్స్ కొట్టేస్తుంది.
పెద్ద ప్రాజెక్ట్స్
ఈ బ్యూటీ డెకాయిట్ మూవీలో నటించగా, ప్రస్తుతం మూడు భారీ బడ్జెట్ చిత్రల్లో నటిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా అల్లు అర్జున్ మూవీలో ఈ ముద్దుగుమ్మ నటిస్తుంది.
డెకాయిట్
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది తాజాగా, రెడ్ కలర్ డ్రెస్‌లో ఉన్న ఫొటోస్ షేర్ చేయగా ఇవి ప్రతి ఒక్కరి మనసు దోచుకుంటున్నాయి.