మే తొలి వారం ఓటీటీలో సందడికి సిద్దమైన సినిమాలు..

Prudvi Battula 

02 May 2025

సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన యాక్షన్-ప్యాక్డ్ థ్రిల్లర్ 'జాక్' మే 2 నెట్‎ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది.

నితిన్, శ్రీలీల జంటగా నటించిన 'రాబిన్‎హుడ్' డిజిటల్ మే 2 నుంచి జీ5లో డిజిటల్ వేదికగా ప్రసారం అవుతుంది.

టర్కిష్ రొమాంటిక్ డ్రమ్ సినిమా 'లవ్ సీజన్'. ఇది మే 1 నుంచి Vrott అనే ఓటీటీలో తెలుగులో కూడా అందుబాటులో ఉంది.

నవాజుద్దీన్ సిద్ధిఖీ, ప్రియా బాపట్, కిషోర్ కుమార్ హులీ, గగన్ దేవ్ రియర్, హుస్సేన్ దలాల్ ముఖ్య పాత్రల్లో 'కోస్టావ్'  అనే హిందీ మూవీ మే 1 నెట్‎ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమ్ అవుతుంది.

మలయాళ అడ్వెంచర్ కామెడీ చిత్రం 'బ్రోమాన్స్' సోనీలివ్ వేదికగా మే 1 నుంచి డిజిటల్ వీక్షకులను అందుబాటులో ఉంది.

'ఎక్సటెర్రిటోరియల్' అనే ఇంగ్లీష్ సస్పెన్స్‌ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఏప్రిల్ 30 నుంచి నెట్‎ఫ్లిక్స్ వేదికగా అందుబాటులో ఉంది.

థ్రిల్లింగ్ సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ డ్రామా 'ది ఎటర్నాట్' ఏప్రిల్ 30 నుంచి నెట్‎ఫ్లిక్స్‎లో ప్రసారం అవుతుంది.

ఇంగ్లీష్ బ్లాక్ కామెడీ మిస్టరీ డ్రామా మూవీ 'అనదర్ సింపుల్ ఫేవర్' అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఏప్రిల్ 30 నుంచి స్ట్రీమ్ అవుతుంది.