డిసెంబర్ సెకండ్ వీక్‎లో ఓటీటీలో సందడికి సిద్దమైన చిత్రాలు..

13 December 2024

Battula Prudvi

ఆగస్ట్ 15న బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అనిపించుకున్న యాక్షన్-అడ్వెంచర్ డ్రామా ‘తంగలాన్’ డిసెంబర్ 10 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది.

‘రోటి కపడా రొమాన్స్‌’ అనే తెలుగు కామెడీ రొమాంటిక్ డ్రామా సినిమా డిసెంబరు 12న ఈటీవీ విన్‌ వేదికగా ప్రసారం అవుతుంది.

డిస్నీ+హాట్‌స్టార్‌‎లో ‘ఇన్‌సైడ్‌ అవుట్‌ 2’ అనే హాలీవుడ్ బ్లాక్ బస్టర్ యానిమేటెడ్ మూవీ డిసెంబరు 12 నుంచి స్ట్రీమ్ అవుతుంది.

సూర్య ద్విపాత్రాభినయంలో నటించిన యాక్షన్ మూవీ ‘కంగువ’ డిసెంబర్ 13 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం కానుంది.

డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా ‘హరి కథ: సంభవామి యుగే యుగే’ అనే ఓ తెలుగు సినిమా డిసెంబరు 13 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

గ్రామీణ యాక్షన్ డ్రామా సర్ తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీలో అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు ఆహాలో డిసెంబర్ 13 నుంచి స్ట్రీమ్ కానుంది.

‘బౌగెన్‌విల్లా’ అనే మలయాళ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ డిసెంబర్ 13 నుండి సోనీలివ్‎లో అందుబాటులో ఉంటుంది.

మలయాళ చిత్రం ‘కదా ఇన్నువారే’ మనోరమమాక్స్ అనే ఓ ఓటీటీ యాప్‎లో డిసెంబర్ 13న స్ట్రీమింగ్ కోసం సిద్ధమైంది.