సినిమాలు తక్కువ సోషల్ మీడియాలో సందడేక్కువ.. 

Rajeev 

06 May 2025

Credit: Instagram

మెహ్రీన్ 2016లో తెలుగు చిత్రం కృష్ణ గాడి వీర ప్రేమ గాధతో నటిగా అరంగేట్రం చేసింది. తొలి సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. 

ఇందులో ఆమె నాని సరసన నటించింది. ఈ చిత్రం విజయవంతమై ఈ ముద్దుగుమ్మకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.

2017లో ఫిల్లౌరీ చిత్రంతో హిందీ సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. కానీ ఆ సినిమా అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. 

తెలుగులో మహానుభావుడు (2017), రాజా ది గ్రేట్ (2017), ఎఫ్2, ఎఫ్ 3,  అశ్వథ్థామ (2020) సినిమాల్లో నటించి మెప్పించింది.

మెహ్రీన్ 10 సంవత్సరాల వయసులో మోడలింగ్ ప్రారంభించి, కసౌలి ప్రిన్సెస్ టైటిల్ గెలుచుకుంది.

2021 మార్చిలో హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్ మనవడు, అడంపూర్ ఎమ్మెల్యే భవ్య బిష్ణోయ్తో నిశ్చితార్థం జరిగింది. కానీ పెళ్లి క్యాన్సిల్ అయ్యింది. 

ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.