సరికొత్త ఫోజులతో మెస్మరైజ్ చేస్తున్న అలియా భట్

Phani CH

02 May 2025

Credit: Instagram

బాలీవుడ్ లో వారసత్వంగా వచ్చినా.. సొంత కాళ్ల మీద నిలబడింది బాలీవుడ్ నటి ఆలియా భట్. సొంతంగా స్టార్ హీరోయిన్ ఇమేజ్ ను సంపాదించుకుంది.

బాలీవుడ్ లో వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులను తనదైన శైలిలో ఆకట్టుకుంటోంది అలియా భట్.

‘ఆర్ఆర్‌ఆర్‌’ చిత్రం ద్వారా అలియా తెలుగు ప్రేక్షకులకూ దగ్గరైంది. ఈ చిత్రంలో సీత పాత్రలో నటించి తెలుగు ప్రజలందిరిని మెప్పించింది.

షూటింగ్ సమయంలో కూడా తెలుగు మాట్లాడేందుకు ప్రయత్నించింది. ఆమెకు తెలుగు భాషపై ప్రత్యేక అభిమానం ఉంది.

బ్రహ్మాస్త్ర సినిమా తరువాత పెళ్ళి.. పిల్లలతో ఆలియా భట్.. వెండితెరకు కొంత కాలం దూరంఅయ్యింది. పాప ఆలనా కోసం ఇంకాస్త గ్యాప్ తీసుకున్నఆలియా భట్.. రీసెంట్ గా మళ్ళీ సినిమాల్లో యాక్టీవ్ అవుతోంది.

ఇప్పుడు హాలీవుడ్‌ లో తన నటనను నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉంది. స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘హార్ట్‌ ఆఫ్‌ స్టోన్‌’ చిత్రం ద్వారా హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.

మెట్ గాలా 2024 అంతర్జాతీయ వేదికపై కూడా ప్రత్యేకమైన చీరలో కనిపించి అలియా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.