చీరకట్టులో పిచ్చెక్కిస్తున్న శోభిత నయా ఫోజులు

Phani CH

02 May 2025

Credit: Instagram

తెలుగు పిల్ల తెనాలి పిల్ల  శోభిత ధూళిపాళ. బాలీవుడ్ లో సెటిల్ అయ్యింది. తెలుగులో కూడా సినిమాలు చేసింది. సోషల్ మీడియాలో మాత్రం కాకరేపుతోంది. కుర్రాళ్ళ చేత చెమటలు పుట్టిస్తోంది. 

ఈ తెలుగు అందం మొదట హిందీ సినిమాల్లో తన అదృష్టాన్ని పరిక్షించుకుంది. 2016లో అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో వచ్చిన 'రామన్ రాఘవ్ 2.0'లో నటించింది. 

ఆ తర్వాత 'చెఫ్', 'కాలాకాండి' మొదలగు హిందీ సినిమాలు చేసింది. తెలుగులో అడవి శేష్ హీరోగా వచ్చిన 'గూఢచారి' లో నటించి ఇక్కడి వారికి పరిచయమైంది. 

తెలుగులో రెండు మూడు సినిమాల్లో మెరిసింది శోభిత.తమిళంలో ఆమె చేసిన పొన్నియన్ సెల్వన్ సినిమాలో..ఆమె అందానికి ఫిదా అయ్యారు ఆడియన్స్.

ఇక సౌత్ లో తెలుగు, తమిళ భాషల నుంచి వరుస ఆఫర్లు ఆమె గుమ్మం తొక్కుతున్నాయి. ఈక్రమంలో బాలీవుడ్ నుంచి కూడా శోభితకు అవకాశాలు తక్కువేమి లేవు. 

శోభిత ధూళిపాళ.. నాగ చైతన్య, సమంత విడాకుల తర్వాత అతనిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ ముద్దుగుమ్మ చైతన్యతో మ్యారేజ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంది.

అలాగే పలు ఈవెంట్స్‌కు వెళుతూ నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు ఈ జంట. అయితే ప్రజెంట్ చైతన్య- శోభితలు తల్లిదండ్రులు కాబోతున్నారని సమాచారం.