గ్లామర్ డోస్ పెంచినా కృతిశెట్టిని పట్టించుకోవడం లేదా.? 

12 october 2025

Rajeev 

ఉప్పెన సినిమాతో మెగాస్టార్ మనసు దోచిన ఈ బ్యూటీ.. చిరు ఆన్‌ స్టేజ్‌ చెప్పినట్టు.. ఇండస్ట్రీలో ఎక్కడికో వెళ్లిపోతుందని అందరూ అనుకున్నారు.

కానీ చివరికి ఎక్కడికీ పోకుండా సినిమా అవకాశాలే లేకుండా.. మిగిలిపోయారు.. ఆమె కృతిశెట్టి. 

వరుస ప్లాప్‌లతో సతమతమవుతూ.. మేకర్స్ వైపు అవకాశం కోసం ఆశగా చూసే వరకు పరిస్థితి తెచ్చుకున్నారు.

కృతి శెట్టి రీసెంట్ డేస్ లో షూట్‌లో కాస్త బోల్డ్‌ గా కనిపించారు. తాను హద్దులు దాటేందుకు రెడీ అన్నట్టుగా మేకర్స్ కు హింట్ ఇచ్చారు.

ఆ ఫోటోలతో నెట్టింట కూడా తెగ వైరల్ అవుతున్నారు. కానీ అవే ఫోటోలతో మేకర్స్ మైండ్‌లో రిజిస్టర్ అయ్యారా? లేదా అనేది ఇక్కడ పాయింట్. 

ప్రస్తుతం సోషల్ మీడియా ఖాతాలలో గ్లామర్ ఫోజులతో మెంటలెక్కిస్తోంది ఈ వయ్యారి. 

ప్రస్తుతం కృతికి తెలుగులో ఒక్క సినిమా ఛాన్స్ రావడం లేదు. కానీ తమిళం, మలయాళంలో మాత్రమే ఈ అమ్మడు అవకాశాలు అందుకుంటుంది.