ఇంకెన్నాళ్లు ఈ ఎదురుచూపులు.. ఆఫర్స్ కోసం కావ్య వెయిటింగ్.?

21 october 2025

Rajeev Rayala

Images: Instagram

 టాలీవుడ్ లో చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్ లు తమ నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 

ఇప్పుడు హీరో, హీరోయిన్స్ గా మారిన వారు చాలా మంది ఉన్నారు. వారిలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. 

ఈ చిన్నది చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. గంగోత్రి సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. 

ఇక ఇప్పుడు హీరోయిన్ గా మారి సినిమాలు చేస్తుంది. మసూద సినిమాతో హీరోయిన్ గా మారింది కావ్య కళ్యాణ్  రామ్.

తొలి సినిమాతోనే హీరోయిన్ గా ఆకట్టుకుంది. తన నటనతో మెప్పించింది ఈ చిన్నది.

ఆతర్వాత వేణు దర్శకత్వంలో బలగం సినిమాలో నటించింది. బలగం సినిమా పెద్ద హిట్ అయ్యింది. 

ఆతర్వాత ఆమె హీరోయిన్ గా చేసిన ఉస్తాద్ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమా తర్వాత కావ్య సినిమాలకు గ్యాప్ తీసుకుంది.