చిల్ మూడ్‌లో జాన్వీ కపూర్..మత్తెక్కిస్తున్న లేటెస్ట్ ఫొటోస్!

samatha 

06 february 2025

Credit: Instagram

అందాల ముద్దుగుమ్మ, శ్రీదేవి గారాల పట్టీ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ బ్యూటీ సొంతం.

దేవర సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ అమ్మడు, ఈ మూవీతో మంచి హిట్ తన ఖాతాలో వేసుకొని వరసగా ఆఫర్స్ అందుకుంటుంది.

.ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆర్సీ 16 సినిమా షూటింగ్‌లో ఫుల్ బిజీగా ఉన్నట్లు సమాచారం.

అయితే జాన్వీ కపూర్ సోదరి ఖుషీ కపూర్ కూడా హీరోయిన్‌గా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంది.ఈ బ్యూటీ లవ్ యాపా అనే సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ సినిమా ఫిబ్రవరీ7న విడుదల కానుంది.

ఈ సినిమాలో అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ హీరోగా నటిస్తున్నారు. అయితే మూవీ విడుదల నేపథ్యంలో చాలా మంది బాలీవుడ్ ప్రముఖులు ఈ మూవీని ప్రీ వ్యూగా వీక్షించడం జరిగింది.

అయితే ఈ సినిమాను తన సోదరితో కలిసి జాన్వీకపూర్ కూడా వీక్షించారు. దీని కోసం జాన్వీ తన సోదరి, తన ఫొటో ఉన్న టీ షర్ట్‌ను ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

బ్లాక్ కలర్ టీషర్ట్‌లో జాన్వీ చూడనీకి చాలా అందంగా, కలర్ ఫుల్‌గా కనిపిస్తోంది. ఫుల్ చిల్ మూడ్‌లో ఉంది ఈ నటి. అంతే కాకుండా కొంటె చూతో ఈ బ్యూటీ కుర్రకారుకు మత్తెక్కిస్తుంది.

 ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక  జాన్వీ తన సోదరికి హార్ట్ ఫుల్‌ విషెస్ తెలియ జేసింది. తన సోదరి సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టబోతున్నందుకు తనకు ఎంతో గర్వంగా ఉందని పేర్కొంది.