తెల్ల చీరలో అతిలోక సుందరి గారాల పట్టీ..కొంటె చూపు చూస్తూ..
samatha
10 february 2025
Credit: Instagram
శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వన్నెతగ్గని అందంతో, హాట్ అండ్ క్యూ ట్ లుక్స్‌తో తన అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ చిన్నది.
ధడక్ సినిమాతో బాలీవుడ్‌లోకి నటిగా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు, దేవర సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించి, మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.
జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవర మూవీలో నటించి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది జాన్వీ కపూర్.
ఇక ప్రస్తుతం జాన్వీ మెగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన 'RC-16 మూవీలో' నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే.
ఇక ఇటు సినిమాల్లో బిజీగా ఉంటూనే, ఎప్పుడూ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది అతిలోక సుందరి గారాల పట్టీ జాన్వీ.
ఎప్పటికప్పుడు తన వరస ఫొటో షూట్స్‌తో కుర్రకారుకునిద్రలేకుండా చేస్తుంది. అందాల బాణాలు విసురుతూ ఈ చిన్నది గ్లామర్ ట్రీట్ ఇస్తుంది.
తాజాగా జాన్వీ వైట్ కలర్ శారీ కట్టుకొని, కొంటె చూపు చూస్తూ.. యూత్‌కు నిద్రలేకుండా చేస్తోంది. ఈ బ్యూటీ వెకేషన్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది.
దీంతో ఫొటోలో వైట్ కలర్ శారీలో బోట్‌లోప్రయాణం చేస్తూ, ఫొటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెటజన్స్‌ను తెగ ఆకట్టుకుంటున్నాయి.