జలకన్యలా జాన్వీ.. వజ్రంలా మెరిసిపోతున్న ఫొటోస్ వైరల్ .. 

samatha 

10 february 2025

Credit: Instagram

దేవర బ్యూటీ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం.

ధడక్ సినిమాతో నార్త్‌లో హీరోయిన్‌గా సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ దేవర సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది.

ఇక ఈ బ్యూటీ వరస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది.

అంతేకాకుండా వరస ఫొటో షూట్స్‌తో కుర్రకారును మాయ చేస్తూ.. తన పరువాలతో విందులిస్తుంటుంది ఈ అందాల సుందరి జాన్వీ కపూర్.

తాజాగా జాన్వీ సిల్వర్ కలర్ డ్రెస్‌లో మెరిసిపోయింది. సరికొత్త గ్లామర్ ఫొటోషూట్‌తో తన అభిమానుల ముందుకు వచ్చి అందాలతో విందుభోజనం పెట్టేస్తోంది.

సిల్వర్ కలర్ డ్రెస్‌లో జాన్వీ చాలా అందంగా, జలకన్యలా మెరిసిపోతుంది. ఒంటినిండా వజ్రాలే ధరించిందా అనేలా ఉంది ఈ ముద్దుగుమ్మ డ్రెస్.

సరికొత్తగా ఈ సారి జాన్వీ తన అభిమానుల ముందుకు వచ్చింది. జ్యువెల్లరీ ఉన్న డ్రెస్ ధరించి, మత్తెక్కించే చూపులతో యూత్‌కు నిద్రలేకుండా చేస్తుంది.

ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో జాన్వీ దివి నుంచి భువికి దిగివచ్చిన దేవకన్యా అంటున్నారు నెటిజన్స్.