ఆ అందమే అసూయ పడదా.. చీరలో జబర్దస్త్ బ్యూ టీ గ్లామర్ ట్రీట్
samatha
2 march 2025
Credit: Instagram
జబర్దస్త్ బ్యూటీ వర్ష గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. జబర్దస్త్ కామెడీ షోలో తనదైన రీతిలో కామెడీ పండిస్తూ మంచి ఫేమ్ సంపాదించుకుంది.
ముఖ్యంగా జబర్దస్త్‌లో ఇమ్మాన్యుల్‌తో జోడి కట్టీ తన కామెడీ, పంచ్ డైలాగ్స్‌తో మంచి ఫేమ్ సంపాదించుకుంది.
తెలుగు రాష్ట్రాల్లో వీరి జోడికి ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. వీరిద్దరు అంటే చాలా మందికి ఇష్టం.
అంతే కాకుండా వీరు సెట్ పై ప్రేమలో ఉన్నట్లు నటించి మరింత క్రేజ్ సంపాదించుకున్నారు. దీంతో వీరికి బుల్లితెరపై మంచి ఫేమ్ వచ్చింది
వర్ష ఇటు జబర్దస్త్, అటు శ్రీదేవి డ్రామా కంపెనీలో తన స్కిట్స్, డ్యాన్స్‌తో అదరగొడుతుంది. హీరోయిన్ రేంజ్ అందం ఉన్నా, ఈ అమ్మడు మాత్రం బుల్లితెరపైనే సందడి చేస్తూ,తన ఫ్యాన్స్‌ను ఎంటర్టైన్ చేస్తుంది.
ఇక ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ వరస ఫొటో షూట్‌తో తన అభిమానులకు అందాలతో విందు ఇస్తుంటుంది ఈ బ్యూ టీ.
తాజాగా రెడ్ చీరలో తన అందాలతో కుర్రకారుకు గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. ఏకంగా రోడ్డుపైనే అందాలు ఆరబోస్తూ.. ఫొటోలకు ఫోజులిచ్చింది.
ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో వర్ష రోడ్డు పై ఏంటీ ఈ అల్లరి అంటూ తమ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.