తెలుగులో సినిమాలు తగ్గించేసిన తమన్నా.. ఫోకస్ అంతా అక్కడే

11 october 2025

Rajeev 

 అభిమానులంతా ముద్దగా మిల్కీ బ్యూటీ అని పిలుచుకునే తమన్నా.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది.

తెలుగు, తమిళ్ సినిమాలతో పాటు బాలీవుడ్లోనూ నటిస్తూ యమా బిజీగా గడిపేస్తుంది. కేవలం నటిగానే కాదు స్పెషల్ సాంగ్స్ ల్లోనూ ఊపేస్తోంది 

నిజం చెప్పాలంటే సినిమాలతో పోల్చుకుంటే.. స్పెషల్ సాంగ్స్ తోనే ఎక్కువ క్రేజ్ తెచ్చుకుంది ఈ హాట్ బ్యూటీ.

 ప్రస్తుతం తమన్నా సినిమాల స్పీడ్ తగ్గించింది. అడపాదడపా సినిమాలు చేసి మెప్పిస్తుంది. 

తెలుగులో మొనీమధ్య ఓదెలు 2 సినిమా చేసింది.. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.

ఇక ఇప్పుడు ఎక్కువగా బాలీవుడ్ పైనే ఫోకస్ చేసింది. తమన్నా చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి.

ఓ స్టార్ హీరో తనను అవమానించాడని, నోటికొచ్చినట్టు మాట్లాడాడని తెలిపింది.

ఓ సీన్ లో నటించాను అని చెప్పినందుకు ఓ స్టార్ హీరో తన పైకోప్పడ్డాడని.. ఆ తర్వాత వచ్చి క్షమాపణలు చెప్పాడని తెలిపింది